తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఆత్మీయుడు కుటుంబ శ్రేయోభిలాషి తాటిపర్తి కుటుంబ సభ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త తాటి పర్తి చంద్ర శేఖర్ శాసన సభ్యుడు గా ఎన్నికైనందుకు మొక్కు తీర్చుకునేందుకు శనివారం తన ఇంటి వద్దనుండి మండల ప్రాదేశిక సభ్యురాలు ( ఎం పి టి సి ) భర్త మస్తాన్ తెట్టు వరకు పాదయాత్ర చేపట్టాడు. రమాదాన్ సందర్భంగా ఆయన శనివారం సాయింత్రం ప్రారంభించిన పాదయాత్ర కి స్థానిక వై ఎస్ ఆర్ సి పి నాయకులు, శ్రేణులు మద్దతు పలికారు. తమ నాయకుడు అంతా తానై సింగరాయకొండ గ్రామ పంచాయతీని వై ఎస్ ఆర్ సి పి చేజిక్కించుకునేందుకు కృషి చేయడమే కాకుండా పార్టీ కి క్రమశిక్షణ గల కార్యకర్తగా అధినాయకత్వం ఆశీస్సులు పొంది ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుత మార్కాపురం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజక వర్గం నుండి శాసన సభ్యుడు గా ఎన్నికై తమ పార్టీకి బహుమతిగా ఇచ్చారని మస్తాన్ అన్నారు. అదే విధంగా సింగరాయకొండ గ్రామ పంచాయతీ ఎన్నికల లో తన ముద్ర వేసుకుని పార్టీ నాయకత్వ ఆశీస్సులు పొందాడని ఆయన పేర్కొన్నాడు. తమ నాయకుడు శాసన సభ్యుడు గా రాష్ట్ర శాసన సభకి ఎంపికవడం తో గతం లో మొక్కు కున్న ప్రకారం శనివారం సింగరాయకొండ నుండి తెట్టు దర్గా వరకు పాదయాత్ర చేపట్టినట్లు మస్తాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వై ఎస్ ఆర్ సి పి నాయకులు ఇస్మాయిల్, పటేల్, అల్లాభక్షు, సవలం కోటేశ్వర రావు ( కోటి), రియాజ్,సలీం తదితరులు పాల్గొన్నారు.