తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

మార్కాపురం జిల్లా గిద్దలూరు దశాబ్దాలుగా స్వచ్ఛందంగా నిరంతర సేవలు అందిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారికి మార్కాపురం పట్టణానికి చెందిన గ్లోబల్ ఫౌండేషన్ మరియు మదనపల్లెకు చెందిన పావని చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నారాయణరెడ్డిని గుర్తించి స్ఫూర్తి ప్రదాత సోషల్ సర్వీస్ అవార్డు 2026 కు మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు అందించారు. జి చెన్నకేశవులు గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయిన ఎడల ఎవరు భయంతో ముందుకు రారు అలాంటిది స్వచ్ఛందంగా నేను సైతం అంటూ అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకొస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు ముందుకు వస్తున్న సందర్భంగా మేము సంయుక్తంగా స్ఫూర్తి ప్రదాత సోషల్ సర్వీస్ అవార్డ్ మా సంస్థ తరఫున 2026 కి ఇవ్వడం మాకు మా సంస్థకు శుభ పరిణామంగా ఉందన్నారు. అవార్డు గ్రహీత బి యస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి వారిని గుర్తించి ఘనంగా టోపీ శాలువా మెమెంటో ప్రశంసా పత్రం అందించి ప్రముఖుల చేత సన్మానం అందుకోవడం గొప్పగా అనిపిస్తుందన్నారు.అవార్డు పొందిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ సేవలు చేయాలని తపన నాలో పెరుగుతుందన్నారు ఇప్పటికే పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో కాశినాయన ఆజ్ఞతోటి ప్రతి సోమవారం గిద్దలూరు లోని కాశినాయన గుడి ఆవరణమునందు శనివారం రంగస్వామి దగ్గర వేమారెడ్డి సత్రం నందు దాతల సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు వేరువేరు రకాలుగా సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ముందుకెళ్తున్నామన్నారు. మాకు ఈ అవార్డ్ అందించిన జి చెన్నకేశవులు శ్రీ బి ఏ రాజస్వామి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీమతి పివిసి అంజనీ కుమారి సిఎస్సి కోర్ట్ సీనియర్ సూపర్నెంట్ హైదరాబాద్ తెలంగాణ వారు గొట్టెముక్కల చెన్నకేశవులు శ్రీ బి ఏ రాజస్వామి పిన్నిక శివ చెన్నకేశవస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు చేతుల మీదుగా అందుకున్నారు. స్నేహితులు బంధువులు గిద్దలూరు, బద్వేల్ తాలూకా అభిమానులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *