తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన, కందుకూరులోని శ్రీ నారాయణ సంస్థల విద్యార్థులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం టిడిపి కార్యాలయంలో అభినందించారు..
రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన వి. శ్రీరామకృష్ణ (598) ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా అక్షయ (596), కీర్తన (594), హన్సిక (592), హిమశ్రీ (589) లను ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత చదువుల్లోనూ రాణించి మంచి స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు, సొంత ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు..
క్లస్టర్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ అనీస్ భాను, అకాడమిక్ డీన్ జాన్, అధ్యాపకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.