తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

సామాజిక విప్లవకారుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కందుకూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, ప్రాణదాతలుగా ముందుకు వచ్చిన యువతను మరియు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించాను. దేశ ప్రజలందరూ నిత్యం స్మరించుకోవాల్సిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. చిన్నతనంలో అంటరానితనం వంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, మొక్కవోని పట్టుదలతో చదివి, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న ధ్యేయంతో మన రాజ్యాంగాన్ని రూపొందించిన ఆయన కృషి చిరస్మరణీయం.
అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన చూపిన బాటలోనే నా ప్రయాణం సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పట్టణంలో త్వరలోనే అన్ని వసతులతో కూడిన ‘అంబేద్కర్ భవన్’ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తున్నాను. మన ప్రభుత్వం దళిత, బహుజన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. దళిత బహుజనుల అభ్యున్నతికి, వారి హక్కుల రక్షణకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాను.

జై భీమ్! జోహార్ అంబేద్కర్!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *