తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ సింగరాయకొండలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ ఘటనపై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే కఠినమైన చట్టాలు అమలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.