తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
ముదువర్తి పాలెం అభివృద్ధి లక్ష్యంగా మంగళవారం సిసి రోడ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది, శిలాఫలకాలు వేసి వదిలేయడం కాదు, పనులు పూర్తి చేసి ప్రజలకు అందించడం మా ప్రభుత్వ విధానం. 22 నెలల్లోనే ముదువర్తి పాలెంలో రూ.1.75 కోట్లు అభివృద్ధి పనులు పూర్తి చేశాం. 16 లక్షలతో సీసీ రోడ్ ప్రారంభించాం. లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి విద్యుత్ పనులు చేపట్టాం.కాజ్‌వే మొదటి దశ పూర్తవడంతో ఉప్పునీటి సమస్య తగ్గింది. జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి పనులు త్వరలో ప్రారంభమవుతాయి.ప్రజల సమస్యల పరిష్కారంలో నేను ఎప్పుడూ రాజీ పడను. అభివృద్ధి నా లక్ష్యం, ప్రజల సంక్షేమం నా కర్తవ్యం.