తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మహిళలపై జరిగే నేరాలు గురించి అవగాహన. సింగరాయకొండ లో ని MSR ఫ్యాక్టరీ నందు సింగరాయకొండ కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వై శ్రీహరి మహిళలు పై జరిగే నేరల గురించి అవగాహనా సదస్సు నిర్వహించినా రు.నేటి సమాజంలో మహిళలకు మంచి గుర్తింపు ఉన్నది. అన్నీ రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. ఏ రంగంలో తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. అలాంటిది కొద్ది మంది వారి వలన మహిళలపై జరిగే నేరాలు ప్రధానంగా లైంగిక వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులు, అపహరణ మరియు యాసిడ్ దాడులు జరగటం బాధాకరం. అందువలననే మహిళలపై జరిగే దాడులపై కొన్ని కఠిన మైన చట్టాలు చేశారు. వాటి గురించి ప్రతీ మహిళ తెలుసుకోవాలి. వారి పై జరిగే వంటి రకాలుగా ఉంటాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం వీటికి కఠిన శిక్షలు ఉన్నాయి.నేరాల నివారణకు తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలు:శక్తీ టీమ్స్ (శక్తి టీమ్స్ ): బహిరంగ ప్రదేశాల్లో వేధింపులను అరికట్టడానికి ఇవి పనిచేస్తాయి.ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ రక్షణ కల్పించడానికి,
112 & 100: మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఈ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
సైబర్ నేరాలకు -1930 కాల్ చేయవచ్చు. అదేవిధంగా గంజాయి నిర్ములన గురించి మరియు వాటి గురించి వివరించినారు.
సామాజికంగా అవగాహన పెంచడం మరియు చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ఈ నేరాలను తగ్గించవచ్చు అని చెప్పినారు.