తొలి శుభోదయం న్యూస్ నరసరావుపేట:-
యం.ఆర్. హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి నేషనల్ బోర్డ్ డైరెక్టర్ రోడ్డా తిరుపతయ్య ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ పి.ఎల్. శ్రీనివాస రావు పల్నాడు జిల్లా చైర్మన్ కే. గణేష్ . అలాగే పల్నాడు జిల్లా ఇంచార్జ్ కె హరినాథ్ బ్రహ్మచారి మంగళవారం నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రమ్య కీర్తన ని యం.ఆర్. హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ తరఫున మర్యాదపూర్వకముగా వారిని కలవడం జరిగినది నరసరావుపేట టౌన్ లోని మునిసిపల్ వార్డులలో గల సమస్యలపై అలాగే టౌన్ లో అనేక ప్రాంతాలలో ఆక్రమణలకు గురి అవుతున్న సమస్యల పైన వినతి పత్రాన్ని వారికి అందజేయడం జరిగినది మున్సిపల్ కమిషనర్ స్పందించి త్వరలోనే సమస్యలపై చర్యలు తీసుకుంటారని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం కి ఏపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ అలాగే పల్నాడు జిల్లా చైర్మన్ అలాగే పల్నాడు జిల్లా ఇంచార్జ్ మరియు విలేఖరి ప్రసాద్ మరియు రమాకాంత్ లు హాజరై వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కి అందజేసి ఉన్నారు.