పెట్రోల్ మరియు డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు, రైతులు, వాహనదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు అద్దంకి పట్టణంలోని VSR పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీలలో భాగంగా బంక్‌లలో ఉన్న ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, విక్రయ విధానాలపై అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి, పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా కొనసాగించాలని సూచించారు. ఎటువంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలాగే బంకు నిర్వాహకులు ఇంధనాన్ని కేవలం వాహనాలకు మాత్రమే నింపాలని, క్యాన్‌లలో నింపరాదని ఆదేశించారు. క్యాన్‌లలో నింపడం వలన బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం ఉందని, అందువల్ల ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు.ఈ సందర్భంగా ఇంధన నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ గారు, జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు.ఇంధన పంపిణీలో అక్రమాలు జరగకుండా మరియు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రతి పెట్రోల్ బంకు వద్ద పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పుకార్లు ప్రజల్లో ఆందోళనలకు దారి తీసే అవకాశం ఉన్నందున వాటిని నమ్మకూడదని, షేర్ చేయవద్దని సూచించారు.అదనంగా, ప్రజలు డీజిల్ పెట్రోలు కొనుగోళ్లు చేయకుండా కేవలం అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికంగా ఇంధనం నిల్వ చేయడం లేదా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చట్టపరమైన చర్యలు తప్పమన్నారు.జిల్లా ఎస్పీ వెంట దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, ఎస్బి సిఐ శ్రీనివాసరావు, అద్దంకి సీఐ సుబ్బరాజు మరియు సిబ్బంది ఉన్నారు.
