తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ,చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారి సూచనలతో కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా గారి ఆధ్వర్యంలో కందుకూరు టౌన్ ఎస్సై నాగరాజు, కందుకూరు రూరల్ ఎస్సై బాలకృష్ణ, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కందుకూరు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత ప్రదేశాలు, అనుమానిత వ్యక్తుల గృహాలు, పార్సెల్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తనిఖీలు కూడా నిర్వహించారు. అదేవిధంగా ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలైన APSRTC బస్టాండ్ మరియు ముఖ్య కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించి, అక్కడ ఉన్న అనుమానిత వ్యక్తులు మరియు వస్తువులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయటం నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పట్టణంలోని లాడ్జీలను తనిఖీ చేసి, లాడ్జ్ యజమానులకు బస చేసే వ్యక్తుల ఆధార్ కార్డులు మరియు ఇతర వివరాలను నమోదు చేసే విధంగా సరైన రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. రికార్డులు నిర్వహించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా గదులు ఇవ్వరాదని, అనుమానాస్పద వ్యక్తులు బస చేసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.తదుపరి, కందుకూరు పట్టణానికి వచ్చే ప్రధాన మార్గాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ లేకుండా లేదా సరైన పత్రాలు లేని వాహనదారులపై చర్యలు తీసుకొని రూ. 25,000/- జరిమానా విధించారు.ఈ సందర్భంగా కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా మాట్లాడుతూ, కందుకూరు పరిధిలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినప్పుడు లేదా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగిన వెంటనే పోలీసులకు,డయల్ -112 సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత వరకు అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని ప్రజలకు తెలియజేసినారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *