తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. శుక్రవారం జిల్లా నూతన జడ్జి శ్రీ ఏ. సత్యనంద్ ని జిల్లా కోర్ట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో పనిచేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయడంపై ఇరువురు చర్చించారు.న్యాయ మరియు పోలీసు శాఖల పరస్పర సమన్వయం మరింత మెరుగుపడేలా చేస్తూ, నేరస్తులకు త్వరితగతిన శిక్ష పడేలా, బాధితులకు న్యాయం అందేలా పోలీసు శాఖ తరఫున కృషి చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.