తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరు మండలం, తురకపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.పండగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న భారీ పింఛన్లపై హర్షం వ్యక్తమైంది.“పేదల సేవే మా లక్ష్యం… సంక్షేమం అందరికీ చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని డా. లక్ష్మీ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.