ఒంగోలు పట్టణంలోని మంగమూరు జంక్షన్‌ను సందర్శించిన ఒంగోలు డీఎస్పీ , ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించి, ట్రాఫిక్ సీఐ తో పాటు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రమాదాలను తగ్గించే దిశగా కట్టుదిట్టమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, హెల్మెట్ & సీట్ బెల్ట్ వినియోగంపై కఠినంగా అమలు చేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాహనాల రద్దీని సమర్థంగా నియంత్రించాలని సూచించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మరియు సిబ్బంది, డీఎస్పీ గారి సూచనలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *