తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ముండ్లమూరు మండలం, మారెళ్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అంకాలమ్మవారి 63వ వార్షికోత్సవ తిరుణాల మహోత్సవం కార్యక్రమంలో దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసి చైర్మన్ నాగవేణి–సుబ్బారావు, ముండ్లమూరు మరియు దర్శి మండలాల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మారెళ్ల వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్‌చార్జ్ సుంకర రాఘవరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.