ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో నైట్ బీట్ చెకింగ్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసు అధికారులు కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి పత్రాలు పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగే వ్యక్తులను హెచ్చరించారు. ముఖ్య కూడళ్లు, రహదారులు, గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసుల పహారా బలోపేతం చేశారు.ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా, ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ప్రజల సహకారంతో నేరాలను అరికట్టడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *