google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కారించాలని మరియు ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు సోమవారం కందుకూరు డిఎస్పీ కార్యాలయ ఆవరణలోని ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మరియు ఇతర ప్రాంతాల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ గారు స్వీకరించారు.ఫిర్యాదుదారులతో ఎస్పీ గారు నేరుగా మాట్లాడి, వారి సమస్యల పూర్తి వివరాలను తెలుసుకున్నారు. వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరిధిలో సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాఫిర్యాదుల పట్ల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కావున ఆ పిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా నివేదిక అందించాలన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కందుకూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వారి సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలు పడి ఒంగోలులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి రాకుండా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ప్రతి సోమవారం ఆల్టర్నేట్ గా ప్రకాశం,మార్కాపురం జిల్లాలో ఒక్కొక్క సబ్ డివిజన్ లో కూడా ప్రత్యేక మీకోసం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వాటిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరిధిలో సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు.ఈ ప్రత్యేక మీకోసం కార్యక్రమంలో కుటుంబ కలహాలు, చీటింగ్, భర్త/అత్తారింటి వేదింపులు, భూ & ఆస్థి వివాదాలు మరియు ఇతర సమస్యలపై పిర్యాదులు అందాయి.అదే విధంగా ఈ రోజు ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీధర్ గార్లు నిర్వహించిన మీకోసం కార్యక్రమంకు 62 ఫిర్యాదులు అందినాయి.ఈ కార్యక్రమంలో కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, కందుకూరు సీఐ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, ఒంగోలు రూరల్ శేషగిరి రావు, దర్శి సీఐ రామారావు, కొండేపి సీఐ రమణయ్య, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *