పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి.
మహిళల భద్రతకు ప్రాధాన్యత నిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి.
నేరాలు నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ ,ఓపెన్ డ్రింకింగ్, ట్రాఫిక్ లపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఎన్ఫోర్స్మెంట్ను పెంచి చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి.
గంజాయి మరియు మాదకద్రవ్యాలు వంటి ప్రత్యేక దృష్టి సారించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరుపై, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, చట్టాల సమర్థవంతమైన అమలు అంశాలపై జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు సోమవారం డిఎస్పీ గారి కార్యాలయంలో డిఎస్పీ, సీఐలు, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) కేసుల పరిష్కారం, కొత్త చట్ట అమలు చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి చేపట్టిన చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న UI కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి కేసుల నమోదులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పేకాట, కోడి పందాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వారిని బైండ్ ఓవర్ చేయాలనీ, బైండవర్ ఉల్లఘించిన వారిపై తగ్గు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ &డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అలాగే ప్రతి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మహిళా/పిల్లలు భద్రత, సైబర్ నేరాలు,రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, చట్టాలు, శిక్షలపై అవగాహన వంటి అంశాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కుంభాకార దర్పణాలు (Convex Mirrors) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్వీస్ రోడ్డు నుండి జాతీయ రహదారిపై ప్రవేశించే సమయంలో తప్పనిసరిగా వాహనాన్ని ఆపి, ఇరువైపులా పరిశీలించి తర్వాత మాత్రమే ముందుకు సాగాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవ్ చేసే వారు సీట్ బెల్ట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదమని, ఇది మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేసుల దర్యాప్తు మరియు రికార్డుల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో UI కేసులు, ప్రాపర్టీ, మిస్సింగ్ కేసుల దర్యాప్తు, స్టేషన్ రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు నేర నియంత్రణలో మరింత ఫలితాలు సాధించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, కందుకూరు సీఐ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, ఒంగోలు రూరల్ శేషగిరి రావు, దర్శి సీఐ రామారావు, కొండేపి సీఐ రమణయ్య, సబ్ డివిజన్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
