అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా మార్కాపురం జిల్లా పోలీసులు తిరగలదిన్నె గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో నిర్వహిస్తున్న జూద స్థావరంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 7 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.18,350 నగదును స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు వ్యక్తులు, కుటుంబాలు మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు తెలిపారు.జిల్లాలో జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జూదం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *