google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు. మంగళవారం దర్శిలో జరిగిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో ఆమె మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. దర్శి నియోజకవర్గంలో రహదారులు, విద్యుత్ సబ్‌స్టేషన్, టీటీడీ కళ్యాణ మండపం, మినీ స్టేడియం వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శించిన ఆమె, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *