తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
పోగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పొగాకు రైతుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఈనెల 19న ఒంగోలులో జరిగే ట్రాక్టర్ ర్యాలీ కి రైతులందరూ తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే. జయంతిబాబు కోరారు. మంగళవారం ఉదయం కందుకూరులోని 27వ పోగాకువేలం కేంద్రం వద్ద రైతులను ఉద్దేశించి జే. జయంతిబాబు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పొగాకు ధర విషయంలో రైతులందరూ సంతృప్తికరంగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కే అచ్చె నాయుడు పేర్కొనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. పొగాకు పంట పండించేందుకు రైతులకు అధికంగా ఖర్చులు అయ్యాయని,తీరా పండినపంటకు ప్రభుత్వం ధర కల్పించకపోవడం పట్ల రైతులందరూ ఆందోళనకరంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి ఇచ్చిన ప్రకటన అందుకు విరుద్ధంగా ఉందని తెలిపారు. రైతులందరికీ కనీస మద్దతు ధర రాక పోగాకు వేలం కేంద్రాల వద్ద నిరసన తెలుపుతున్నా, ప్రభుత్వానికి పట్టకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 19 జరిగే ట్రాక్టర్ ర్యాలీకి అధిక సంఖ్యలో రైతులు తరలి రావాలని కోరారు. ఈరోజు పోగాకువేలం కేంద్రం వద్ద రైతులతో జరిగిన సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఎస్.ఏ. గౌస్, జీవీబీ కుమార్,రైతులు టీ. రమణయ్య, దామా. ప్రవీణ్, వలేటి. నరసింహం, రామచంద్రారెడ్డి, గుత్త.గోపి తదితరులు పాల్గొన్నారు.