google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఈ వ్యవసాయ సీజన్ లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు, రైతులు, పొగాకు బోర్డు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడుతూ….కనిష్ట ధర రూ. 200 కంటే తక్కువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నో బిడ్ అనేది లేకుండా అన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యాపారులు అంతా అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ లో వేలంలో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో పొగాకు నియంత్రణపై ప్రభుత్వం, పొగాకు బోర్డు, రైతులు కలిసి చర్చిస్తాం. ఈ సీజన్లో ఏ ఒక్క పొగాకు రైతుకు అన్యాయం జరగనివ్వమని పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *