google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

పొగాకు రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా జరగాలని, దళారులు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పొగాకు ధర కిలోకు రూ.200 కంటే తగ్గకుండా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిపారు.ఇది దర్శి ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లా పొగాకు రైతులకు శుభవార్త అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే మరియు జిల్లా టిడిపి అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *