google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశాను.ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో సహాయాన్ని కొనసాగించడం అభినందనీయం.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 25 విడతల్లో సుమారు 900 మంది లబ్ధిదారులకు రూ.10.5 కోట్లకు పైగా సీఎం సహాయనిధి అందించగలిగాం. అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా 138 మందికి దాదాపు రూ.2 కోట్ల సహాయం అందింది.ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భీమా చెక్కులను రూ.5 లక్షల చొప్పున అందజేశాను. ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తూ, అవసరమైన సమయంలో భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి కోవూరు నియోజకవాసుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *