తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :-
బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగులోని జడ్పీ హైస్కూల్‌లో VPR ఫౌండేషన్ నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన నూతన తరగతి గదులను ప్రారంభించాను. అలాగే దామరమడుగు పంచాయతీ పరిధిలోని పల్లెపాళెంలో రూ.34.68 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశాను. ఇందులో పెన్నా డెల్టా నిధులు రూ.17 లక్షలతో నిర్మించిన శ్లాబ్ కల్వర్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, జల జీవన్ మిషన్ నిధులు రూ.7.68 లక్షలతో ఏర్పాటు చేసిన పైప్‌లైన్లు, తాగునీటి కుళాయిలు ఉన్నాయి.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్‌కు అనుగుణంగా అమలవుతున్న P4 విధానం ద్వారా ప్రభుత్వంతో పాటు దాతల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ దిశగా జడ్పీ హైస్కూల్‌లో సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉంది.ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రహదారులే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం.