google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

గత పది పదిహేను సంవత్సరాల నుండి పని చేస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు తాడేపల్లి గిరిజన గురుకుల హెడ్ ఆఫీస్ వారు గిరిజన గురుకుల పాఠశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు తెలుపుతున్నారు

గిరిజన గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా గతంలో నింపిన విధంగా పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు వెయిటేజ్ ఇచ్చి నింపాల్సింది పోయి నిబంధనలు తుంగలో తొక్కి ఎలాంటి వెయిటేజ్ ఇవ్వకుండా బైలా ను తుంగలో తొక్కి 50% కాంట్రాక్ట్ 50% రెగ్యులర్ వాళ్ళతో ఉండాల్సిన పోస్టులు 100% రెగ్యులర్ వాళ్ళతో నింపడం తప్పు అని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు

మెగా DSC ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించగా మిగిలిన పూర్తి వేకేంట్ 788 పోస్టులకు రెన్యువల్ ఇచ్చారు. రెన్యువల్ ఇచ్చిన పోస్టులకు ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను సీనియారిటీ ప్రకారం తీసుకోవాల్సింది పోయి నిబంధనలు గాలికి వదిలి స్టేషన్ సీనియర్ అంటూ 2025-26 అకడమిక్ ఇయర్ లోనే ప్రిన్సిపల్స్ ద్వారా లిస్టు పెట్టించుకొని ఆ ఉపాధ్యాయులతో బేరాలు కుదుర్చుకొని ఎలాంటి మెమో గానీ,ఆర్డర్ గానీ లేకుండా ఓరల్ ఇన్ స్ట్రక్షన్ అంటే నోటి మాట ద్వారా అంటూ వాళ్ళ కు శాలరీ క్లెయిమ్ చేస్తున్నారు అంటూ రెన్యువల్ రాని ఉపాధ్యాయులు వాపోతున్నారు

గిరిజన గురుకుల హెడ్ ఆఫీస్ వారు కమిషన్ల కోసం కక్రుతి తో స్కూల్స్ కి ఇవ్వాల్సిన ఇంప్రెస్స్ అమౌంట్ తగ్గించి చాక్ పీస్ లు స్కూల్ రిజిస్టర్స్ ఎగ్జామ్ పేపర్స్ తో సహా హెడ్ ఆఫీస్ వారే కోనుగోలు చేసి పంపిస్తున్నారు దేనికి ఖర్చుపెట్టాలి అన్న మా సొంత డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుంది మేము వడ్డీలకు తెచ్చి పెట్టవలసి వస్తుంది జీతాలు కూడా రెండు మూడు నెలల కొకసారి వస్తున్నాయి ఖర్చు పెట్ట దానికి కూడా కనీసం బాత్ రూమ్ డోర్ పోయిన గాని అమౌంట్ వుండటం లేదు అంటూ ప్రిన్సిపల్స్ చెప్పకోస్తున్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *