google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు సమావేశమైన వెనుకబడిన వర్గాల ప్రత్యేక కమిషన్ కు
ఉద్యోగ నియామకాలలో ఓపెన్ కేటగిరీ మెరిట్‌లో ఎంపికైన బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించి, వారి వల్ల ఖాళీ అయ్యే బీసీ రిజర్వేషన్ స్థానాలను ఇతర అర్హులైన బీసీ అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐఏఎస్ గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య మసూద్ అలీ, నూకసాని వెంకటేశ్వర్లు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రిజర్వేషన్ విధానం యొక్క అసలు లక్ష్యం వెనుకబడిన వర్గాలకు గరిష్ట అవకాశాలు కల్పించడమేనని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఎంపికైన బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాలో లెక్కించడం వల్ల ఇతర బీసీ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు.
అందువల్ల, ఓపెన్ కేటగిరీలో ఎంపికైన బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే కొనసాగించి, బీసీ రిజర్వేషన్ స్థానాలను పూర్తిస్థాయిలో బీసీ వర్గాలకు అందేలా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఏపీపీఎస్సీని కోరారు. ఈ చర్య ద్వారా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మరియు రిజర్వేషన్ విధానం యొక్క అసలు ఉద్దేశ్యం మరింత సమర్థవంతంగా అమలవుతుందని అభిప్రాయపడ్డారు. కమిషన్ ద్వారా వెనకబడిన వర్గాల నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు విన్నవించుకున్నారు కార్యక్రమంలో బిసి ఉద్యోగుల సంఘం సభ్యులు మరియు బీసీ నిరుద్యోగులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *