google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

సీజేఎఫ్‌ఎస్(CJFS) భూములకు పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 60,505 రైతు కుటుంబాలకు చెందిన 66,276 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ (CJFS) భూములకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని రైతు ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.సీజేఎఫ్‌ఎస్ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 288, తేదీ 01-06-2018 నిబంధనలను అమలు చేసి, వాటి ప్రకారం పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతు కుటుంబాలు భూముల హక్కుల కోసం ఎదురుచూస్తున్నాయని, భూములపై పూర్తి హక్కులు కల్పించే విధంగా పట్టాలు మంజూరు చేస్తే వేలాది కుటుంబాలకు శాశ్వత భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.రైతుల జీవనోపాధికి కీలకమైన ఈ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *