google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా పోలీసులు రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ప్రమాదకర మలుపులు, బ్లైండ్ స్పాట్లు ఉన్న ప్రాంతాల్లో కాన్వెక్స్ మిర్రర్లను ఏర్పాటు చేశారు.వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తగా ప్రయాణించేందుకు ఈ మిర్రర్లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కోసం రోడ్డు భద్రతా చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *