google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన అరవింద్ జోసఫ్ రెడ్డికి అత్యవసర శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.12 లక్షలు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి కృషితో మంజూరయ్యాయి.శుక్రవారం ఈదర గ్రామానికి వెళ్లిన డా. గొట్టిపాటి లక్ష్మీ గారు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలకు అండగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డా. గొట్టిపాటి లక్ష్మీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *