google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరు లో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఒక రోగి కి డయాలసిస్ నిమిత్తం అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చింది. కానీ అది అత్యంత అరుదైన AB – నెగటివ్ గ్రూప్ రక్తం అవడం వల్ల ఆ గ్రూప్ రక్తం ఎక్కడా దొరకనందువల్ల డయాలసిస్ ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బ్లడ్ డోనర్స్ గ్రూపు సభ్యుడు, టంగుటూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న బచ్చల చంద్రశేఖర్ వెంటనే స్పందించి రక్త దానం చేసి ఆ పేషెంట్ ని కాపాడాడు. మానవత్వం తో తన అత్యంత అరుదైన AB నెగటివ్ గ్రూప్ రక్తం దానం చేసిన చంద్రశేఖర్ కు పేషెంట్ తరుపు బంధువులు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కందుకూరు సబ్ బ్రాంచ్ చైర్మన్ చన్నా వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ కానిస్టేబుల్ చంద్రశేఖర్ గతంలో కూడా అనేకసార్లు రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు. యువత అందరూ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ని స్ఫూర్తిగా తీసుకుని రక్తం దొరకక బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు, రోగులకు రక్తదానం చేసి కాపాడాలని, అలాంటి రక్తదాతలే నిజ జీవితంలో హీరోలు అని అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *