google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజబాబుతో కలిసి దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా BDL పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, విద్యుత్, నీటి సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ, BDL పరిశ్రమ ఏర్పాటు ద్వారా దర్శి నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రాంత అభివృద్ధి, ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *