సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని బుంగబావి సెంటర్ నందు గల వెస్ట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, పలకల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సింగరాయకొండ మాజీ సర్పంచ్ షేక్ సందాని భాషా ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాల పిల్లలకు ఈ విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, మాజీ సర్పంచ్ సందాని భాషాకు విద్యార్థులపై ఉన్న ప్రేమాభిమానాలను కొనియాడారు. గతంలో కూడా ఆయన పాఠశాల ప్రాంగణంలో జ్ఞానప్రదాత అయిన సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం మాజీ సర్పంచ్‌ను ఘనంగా సన్మానించినారు.
​ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ ఎస్ దాని, పటాన్ ఆరిఫ్ ఖాన్, పటాన్ సల్మాన్ ఖాన్ మరియు పాఠశాల పూర్వ విద్యార్థి షేక్ హమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యా సామగ్రిని పంపిణీ చేసిన మాజీ సర్పంచ్‌కు పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *