google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, నేరస్థులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రకాశం పోలీసులు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నేర నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అనుమానితులను విచారించడం, నిరంతర గస్తీ నిర్వహించడం ద్వారా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారు.అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అవగాహన కల్పిస్తున్నారు.ప్రజల భద్రత, నేరాల నివారణ మరియు రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ఇలాంటి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *