తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
బ్రహ్మోత్సవాల లో ప్రధాన ఘట్టం మాడవీధుల్లో రథోత్సవం సందర్భం గా భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం,అవాంఛనీయ సంఘటనలు, అడ్డంకులు లేకుండా చూసేందుకు దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు,కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణవేణి, తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, విద్యుత్ అధికారి, టి డి పి నాయకులు, మోతకాపులు పాత సింగరాయకొండ మాడవీధుల్లో కలియ తిరిగారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో చోటు చేసుకున్న సంఘటన ల నేపద్యం లో చేపట్టాల్సిన రక్షణ, బందోబస్తు, అవరోధాలు తొలగింపు, శాంతి భద్రతలు, రథోత్సవం జరిగే ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపి వేత వెంట వెంటనే పునరుద్ధరణ, రోడ్డు ఇరుపక్కల మట్టి తొలగింపు ఇతర అంశాల పై అధికారులు సమీక్షించారు. స్వచ్ఛ పాత సింగరాయకొండ కార్యక్రమం సందర్భంగా గ్రామం లో పర్యటించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు వీధుల శుభ్రత, భద్రత, రోడ్డుకి ఇరువైపుల పేరుకు పోయిన ఒండ్రు మట్టి తొలగింపు పై చైర్మన్ దృష్టి పెట్టి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం, కొండ పైన, కింద సాంస్కృతిక కార్యక్రమాలు, బండలగుడు పోటీలు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలు, వాహనాల రాక పోకల క్రమబద్ధీకరణ, పార్కింగ్ పై అధికారులు సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు, పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీ ప్రజలు, స్థానికులు, మోత కాపులు, సహకరించాలని అధికారులు కోరారు.