తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో 50 మంది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్, కందుకూరు ఎమ్మెల్యే ఎం. నాగేశ్వరరావు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారికి స్వయం ఉపాధి, స్వతంత్ర జీవనానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువర్తన, జిల్లా ఏడీ, శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులు, దివ్యాంగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, లబ్ధిదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.