google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం మండలం, బడేఖాన్ పేట గ్రామ ఇలాకాలో సర్వే నెం. 3 లోని 4 ఎకరాలు భూమిలోకి పోనివ్వకుండా ముందు పొలం దారులు అడ్డుపడుచున్నారని దండా లక్ష్మీరెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ దాఖలు చేసారు. ఈ వివాదం కారణంగా మార్కాపురం రూరల్ పోలీసు స్టేషన్ లో కేసులు నమోదు అయ్యేంత వరకు వెళ్ళింది. Ee వివాదాన్ని తహసీల్దార్ కె.చిరంజీవి BNSS చట్టం, 2023 ప్రకారం నోటీసులు జారీ చేసి, క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, అర్జీదారుని భూమికి పడమర వైపున ఉన్న కొండ దగ్గర నుండి ప్రభుత్వ దారిని చూయించి అట్టి దారిని ఉపయోగించుకోవాలని తెలియజేసి ఆ విధముగా ఉత్తరువు జారీ చేసి రస్తా సమస్య ను పరిష్కరించినారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *