తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:-

తీర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికత,ధార్మిక పరిరక్షణ తో విజయవంతంగా నిర్వహించాలని, ధర్మకర్తల మండలి తో పాటు దేవాదాయ శాఖ,పోలీస్ అధికారులకు పిలుపు ఇచ్చారు. ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్న శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల సమాచార గోడ పత్రికను శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తమ క్యాంపు కార్యాలయం తూర్పు నాయుడు పాలెం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ఇతర సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణవేణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వై, శ్రీహరి, అర్చకుల తో బ్రహ్మోత్సవాల నిర్వహణ,ఏర్పాట్లు,శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వాహనాల పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండ మీద, కొండ కింద ఎక్కడ భక్తులకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.బ్రహ్మోత్సవాలలో ఎక్కడ చూసినా ధార్మిక వాతావరణం ఉట్టి పడేవిధంగా పర్యవేక్షించాలని ధర్మ కర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు కి సూచించారు. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ధర్మ కర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు. సభ్యులు,కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణవేణి,సర్కిల్ ఇన్స్పెక్టర్ వై శ్రీహరి, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వర రావు,అర్చకుడు ఉదయగిరి వెంకట శేష లక్ష్మి నారసింహ చార్యులు,మోత కాపులు, టి డి పి నాయకులు మించల బ్రహ్మయ్య, గాలి హరిబాబు, ఎస్. మురళి, ఇ ఒ కార్యాలయం గుమస్తా బాపట్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *