మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమమునందు ప్రతి సోమవారం ప్లాస్టిక్ రహిత అన్న వితరణ దాతల సహాయంతో ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే ఈ సోమవారం కాశి నాయనకు ఉదయం అభిషేకాలు చేసి పూలతో అలంకరణ చేసిన తర్వాత పురోహితులు శర్మ స్వామి పూజలు నిర్వహించారు పూజలో పాల్గొన్న భక్తులకు ఈ రోజు కాసా శ్రీనివాస రెడ్డి ధర్మపత్ని పాలుగుళ్ళ అనంత లక్ష్మి వారి కుమారుడు వింగ్ కమాండర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి మరియు డాక్టర్ కృష్ణజ ల వారి పుత్రిక ధాక్షిణ్యా రెడ్డి 2వ జన్మ దినోత్సవ సందర్భంగా అన్న వితరణకు ఆర్థిక సహాయ సహకారాలు అందించారు వారికి కాశినాయన చిత్రపటం శాలువా పూలమాలతో శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన సేవాశ్రమం తరఫున ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు విశ్రాంత సూపర్నెంట్ పాలుగుళ్ల కాశిరెడ్డి విశ్రాంత లెక్చరర్ వడ్డీ వీరారెడ్డి ఏరువ రమణారెడ్డి విశ్రాంత సైనికులు లింగారెడ్డి విశ్రాంత ఆర్టీసీ కంట్రోలర్ వెంకటేశ్వర్ల గౌడ్ విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ రమణారెడ్డి కాశినాయన భక్తులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *