కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 60 మంది లబ్ధిదారులకు రూ. 37,83,450 ల విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను స్వయంగా అందజేశారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ వైద్యశాలల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న నిరుపేదలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ఆర్థిక సాయం అందడంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *