బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఆదివారం మధ్యాహ్నం నుండి ప్రారంభం కానున్న నీట్ (NEET) ప్రవేశ పరీక్షల నేపథ్యంలో ఒంగోలులో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఒంగోలులోని నవోదయ, కేంద్రీయ విద్యాలయం, దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డి.ఆర్.ఆర్.ఎం. పాఠశాల, పివిఆర్ బాలుర పాఠశాలల 6 సెంటర్లను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నుండి డీఎస్పీల వరకు విధుల్లో ఉన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను నియమించి, ఎక్కడా అనవసర రద్దీ లేదా గుంపులు ఏర్పడకుండా చర్యలు తీసుకుని, అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్ మరియు మొబైల్ పెట్రోలింగ్ బృందాల ద్వారా నిరంతర నిఘా మరియు పర్యవేక్షణ నిర్వహించారు మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను రెండు జోన్లుగా విభజించి, భద్రతా పర్యవేక్షణ కోసం ప్రతి జోన్‌కు అదనంగా ఒక ఇన్స్పెక్టర్ను కేటాయించామని, పరీక్షా కేంద్రాల రూట్లను డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్ల వద్ద ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక వాహనాల సౌకర్యాన్ని కల్పించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి నిషేధిత వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకుండా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, పరీక్షా ప్రశాంతంగా, సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.జిల్లా ఎస్పీ గారి వెంట డి.ఎస్.పి. ఆర్. శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, సీఐలు ఉన్నారు.