google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలో నిర్వహించిన భారీ యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి పాల్గొనడం ఆనందంగా అనిపించింది.ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం యోగా ఉత్తమ సాధనం. అందుకే ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరుతున్నాను.కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి రిలయన్స్ స్మార్ట్ బజార్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలతో కలిసి యోగాసనాలు వేయడం సంతోషంగా ఉంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాపై ఉన్న ఆసక్తిని చాటారు.ప్రతి రోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఒత్తిడిని దూరం చేసుకొని ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను.
యోగాతో ఆరోగ్యం… ఆరోగ్యంతో ఆనందం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *