google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

దర్శి ఎన్టీఆర్ పల్లెవనం పార్క్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం – యోగాంధ్ర కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొని వందలాది మందితో కలిసి యోగా సాధన చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగం కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం–మనసు–ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన కుటుంబాలు, సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా యోగాలో ప్రతిభ కనబరిచిన చిన్నారులను అభినందించి బహుమతులు అందజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *