google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి (DEO) గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర విద్యార్థి సంఘం ఉమ్మాడి ప్రకాశం జిల్లా అద్యక్షులు కోమటిగుంట్ల శివ మాట్లాడుతూ – ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. పాఠశాల ఆవరణలోనే పుస్తకాలు, యూనిఫాంలు, బెల్ట్లు, షూలు వంటి వాటిని అమ్ముతూ విద్యను వ్యాపారంగా మలుస్తున్నాయి. ఇది విద్యా హక్కు చట్టానికి పూర్తిగా వ్యతిరేకం. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్న ఈ విధానాలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలి. అలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలనిపిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై విద్యా శాఖ బహిరంగంగా విచారణ జరిపి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మాడి ప్రకాశం జిల్లా అద్యక్షులు కోమటిగుంట్ల శివ,జిల్లా విరానారి అక్షయ ,అశోక్, బాలు,తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం ఇదే విధంగా ఆంధ్ర విద్యార్థి సంఘం పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *