google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం పట్టణంలో నివాసం ఉంటున్న బండి రామదాసు s/o యేసు రత్నం (వయస్సు: 35సంవత్సరాలు) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా తేది: 22-06-2026 సాయంత్రం సుమారు 06:00 గంటలకు “తాను చనిపోతున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన స్నేహితుడు అద్దంకి మాధవ డయల్ 112 కి ఫోన్ చేసి వారి ద్వారా వెంటనే మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం తెలియపరిచగా మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు మరియు సీఐ అల్తాఫ్ హుస్సేన్ , ఆదేశాల మేరకు, ఎస్సై వి.వేమన మరియు సిబ్బంది, ఐటీ కోర్ టీం సాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బండి రాములు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని అతని ప్రాణాలను కాపాడడం జరిగింది. ఆ తర్వాత అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, మానసికంగా ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు.వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను చాకచక్యంతో కాపాడిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ SI V.వేమన మరియు వారి సిబ్బంది HG నోవా, డ్రైవర్ బాషా మరియు ఐటి కోర్ సిబ్బందిని మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., అభినందించారు…

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *