google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు బ్యాంకర్లను ఆదేశించారు. కౌలు రైతులకు పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎంఎస్ఎంఈ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు.డ్వాక్రా సంఘాలు, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాల మంజూరుతో పాటు యూనిట్ల ఏర్పాటు వరకు సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. అలాగే పీఎం సూర్య ఘర్ యోజన కింద రుణాల మంజూరును వేగవంతం చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు.జిల్లాలో ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామికాభివృద్ధి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యాల సాధన కోసం అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ గారు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *