తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగరంలోని రూడ్‌సెట్ ద్వారా అమలవుతున్న శిక్షణా కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్‌ను, వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు చేపట్టవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ రూపొందించిన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో లీడ్ జిల్లా మేనేజర్ శ్రీ రమేష్ గారు, నాబార్డ్ అధికారి శ్రీ రవికుమార్ గారు, ఆర్బీఐ ఏజీఎం శ్రీ కిషన్ కుమార్ గారు, డీఆర్‌డీఏ మరియు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు, రూడ్‌సెట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసుల రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.