google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం కొండపి:-

కొండపి డా.బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులాన్ని ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న ప్రహరీ గోడ, డ్రైనేజీ నిర్మాణ పనులు మంత్రి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. కష్టపడి చదివి ఇంటర్ అనంతరం ఐఐటీ, నీట్, సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్లు సాధించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *