google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో సబ్‌డివిజనల్ పోలీసు బలగాలతో కలిసి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవరాజుకుంట కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో తాలూకా సీఐ గారితో పాటు తాలూకా, ఎన్.జి.పాడు, జారుగుమల్లి, టంగుటూరు, మద్దిపాడు పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు మరియు సబ్‌డివిజనల్ సిబ్బంది పాల్గొని కాలనీలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, నేర కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు.అనంతరం ప్రజలకు ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ, అలాగే హెల్మెట్ ధరించడం మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేసి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *