తొలి శుభోదయం న్యూస్ రైల్వే కోడూర్ :-
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట గ్రామంలో జూలై 2 వ తేదీన నిర్వహించనున్న ‘వీబీ-గ్రామ్ (VB-GRAM)’ కార్యక్రమం, బహిరంగ సభతో పాటు హెలిప్యాడ్ ఏర్పాట్లను జోనల్ కోఆర్డినేటర్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, రైల్వే కోడూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం శ్రీ దామచర్ల సత్య గారు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్తలు, గ్రామ, మండల స్థాయి నాయకులతో సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించి, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వీబీ-గ్రామ్ (VB-GRAM)’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.