తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్ పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, భద్రంగా రికవరీ చేసి ఫిర్యాదుదారునికి అప్పగించారు.మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల దానిని గుర్తించి తిరిగి అప్పగించడం సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోయినట్లయితే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా సంబంధిత ఆన్‌లైన్ వేదికల ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.ప్రజల ఆస్తుల రక్షణకు, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీకి ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.